संदेश

మాది సాధింపుల ప్రభుత్వం కాదు... ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం

चित्र
Metro Mat News ( Jayaraju AP ) • 100 శాతం గ్రామాలకు రక్షిత మంచి నీరు అందించిన రాష్ట్రం చేయడమే మా ముందున్న లక్ష్యం • గత పాలకులు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా కేంద్ర నిధులు వదిలేశారు • రుషికొండ రాజప్రాసాదం డబ్బులతో ఓ జిల్లాను అభివృద్ధి చేయొచ్చు • కాకినాడ మాఫియా స్వరూపం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తనిఖీలతో బయటపడుతోంది  • పంచాయతీరాజ్ శాఖలో అప్పులు చూసి... జీతం వద్దని చెప్పేశాను • ప్రభుత్వ సిబ్బందితో సక్రమంగా పింఛన్ల పంపిణీ చేసి చూపించాం • నాశనం అయిన వ్యవస్థలను బలోపేతం చేయడంపైనే దృష్టి • పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాభివృద్ధి... ప్రజా సంక్షేమం కోసం నేను బలమైన సంకల్పంతో ఎన్నికలకు వచ్చాను. ప్రజలంతా జనసేనను వంద శాతం విశ్వసించారు. వందకు వంద స్ట్రయిక్ రేటు ఇవ్వాలని కోరితే, ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించారు. ఇప్పుడు పాలనలోనూ అదే బలమైన సంకల్పాన్ని చేసుకుంటున్నాను. 100 శాతం గ్రామాలకు పూర్తిస్థాయి రక్షిత మంచినీటి పథకం అమలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు

ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తున్న క్రీడాకారులు

Metro Mat News ( Jayaraju AP )గత వై. ఎస్. ఆర్. సి. పి. ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయి. క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడే మేధావులు, ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్య కాలంలో కలిసిన వారిలో ఉన్నారు. ఇలా కలసినవారిలో ప్రముఖ క్రికెటర్ శ్రీ హనుమ విహారి కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను వారు ప్రస్తావించారు. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించారు. క్రీడలతో సంబంధంలేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని వారు ఆవేదనతో విన్నవించారు. క్రికెట్ లో అనుభవం ఉన్నవా

విశ్వ విజేతలకు అభినందనలు

चित्र
Metro Mat News ( Jayaraju AP ) రెండవ సారి టీ 20 ప్రపంచకప్ గెలుచుకుని శ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్ లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులపై మంత్రి నారాయణ సమీక్ష

Metro Mat News ( Jayarahu AP ) :-  రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయింది.చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది.అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు..ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది..ముఖ్యంగా తొమ్మిది,పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థల మధ్య విభజన ఇంకా కొలిక్కి రావడం లేదు.ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన ఆస్తులు,అప్పులు పంపిణీ చేసుకోవాలని ఉంది..కానీ ఆ తర్వాత పంపకాల విషయంలో ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చింది.దీంతో ఇప్పటికీ కొన్ని సంస్థలు విషయంలో పీటముడి వీడటం లేదు.ఇలాంటి సంస్థల్లో కొన్ని సంస్థలు మున్సిపల్ శాఖకు చెందినవి కూడా ఉన్నాయి...అలాంటి సంస్థలపై పురపాలక - పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష చేశారు.విజయవాడలోని సీఆర్దీయే ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ బోర్డు, సంబంధిత అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. *షీలా బిడే కమిటీ నివేద

ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై కలక్టర్లతో సిఎస్ వీడియో సమావేశం

चित्र
Metro Mat News ( Jayaraju AP ) విజయవాడ,29 జూన్: రాష్ట్రంలో ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తున్నారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జులై 1వ తేదీన 65 లక్షల 18వేల 496 మందికి గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింట ఫించన్లు పంపిణీకి సంబంధించి  4 వేల 399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.అదే విధంగా ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షన్ రీల సేవలను కూడా వినియోగించు కునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపిడిఓ,మున్సిపల్ కమీషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఫించన్లు పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 6గం.లకు పింఛన్లు పంపిణీ ప్రారంభం కావాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. ఫించన్లు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శ

అప్రమత్తంగా ఉండండి, భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష..

चित्र
Metro Mat News JAYARAJU AP :-  • 8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా.. • వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం.. • ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ ను స్వయంగా పరిశీలించిన మంత్రి అనిత.. • ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ విధులను మంత్రి అనితకు వివరించిన అధికారులు.. ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐఎండి అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైయ్యే అవకా

రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

चित्र
Metro Mat News ( JAYARAJU AP ) :- అమరావతి, జూన్ 28: వ‌ర్షాకాలంలో ప్ర‌బ‌లే సీజ‌న‌ల్ వ్యాధుల‌ను అరిక‌ట్టేందుకై అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లను  చేపట్టేందుకు తక్షణమే స్పెషల్ డ్రైవ్  నిర్వహించాలని రాష్ట్ర పుర‌పాల‌క మరియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు. మంచినీటి పైపుల్లో లీకేజి లు ఉంటే 24 గంటల్లో అరికట్టాలని, కాలువల్లో చెత్తాచెదారాన్ని జూలై మాసాంతాని కల్లా తొలగించాలని  ఆదేశించారు. అమ‌రావ‌తి సచివాల‌యంలోని ఐదో బ్లాక్ కాన్ఫ‌రెన్స్ హాల్ లో రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల క‌మిష‌నర్లు, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దానికి త‌గ్గ‌ట్లుగా ముంద‌స్తు నివార‌ణ చ‌ర్య‌ల కోసం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకోవాల‌ని క‌మిష‌న‌ర్ల‌కు సూచించారు. ఇప్పటి వరకూ మున్సిపాల్టీల్లో ఎక్క‌డా డెంగ్యూ కేసులు రాలేదని, అక్క‌డ‌క్క‌డా డ‌యేరియా  కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. దీనిపై వైద్యారోగ్య‌శాఖ అధికారుల‌తో కూడా చ‌ర్చించిన‌ట్లు మంత్రి తెలిపారు. డ‌యేరియా నివార‌ణ‌కు ప్ర‌త్యేక డ్ర