కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ పై పార్లమెంట్ లో అభిసంశన తీర్మానం పెట్టాలి : డా మామిడి సుదర్శన్
Metro Mat News ( Jairaju AP ) విజయవాడ / హైదరాబాద్ : దేశంలో ఎన్నికల నిర్వహణలో విఫలం అవ్వడంతో పాటు ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని నిపుణులు నిరూపించినా, నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహారిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాశ్యం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువు తీస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ ఐఏఎస్ పై అన్ని పార్టీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో అభిసంశన తీర్మానం పెట్టి తొలగించాలని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త మరియు సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ - స్ట్రాటెజీ (సీపీఆరెస్స్ ) వ్యవస్థాపకుడు డా మామిడి సుదర్శన్ అన్ని పార్టీలను డిమాండ్ చేశారు. ఎన్నికలు సంఘం తీరుతో విభిన్న సంస్కృతులు సమ్మేళనంతో భిన్నత్త్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారత్ లో నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఎన్నికల వ్యవస్థ, నిర్వహణ, ఫలితాలపై ప్రజలకు నమ్మకం పోయిందని సుదర్శన్ విమర్శించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం టాంపరింగ్ జరిగిందని అధికశాతం ప్రజలు విశ్వాసిస్తున్నారని, 2019 లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయినపుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపించారని ఈవీఎం లు నిషేదించాలని డిమాండ్ చేసారని సుదర్శన్ గుర్తు చేశారు. ఇటీవలె జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎంలు టాంపరింగ్ జరిగిందని, ఒక గ్రామంలో ఓటర్లు అందరూ కాంగ్రెస్ కు ఓట్లేస్తే బీజేపికీ పడ్డాయాని ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే ఈవీఎంల ఈ టాంపరింగ్ జరిగిందని అందుకే సుప్రీంకోర్టు నోటిషులు ఇచ్చిందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉపేక్షిస్తే దేశంలో అంతర్యుద్దం వస్తుందని సుదర్శన్ హెచ్చరించారు. అన్ని పార్టీలు ఏకమై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాన ఎన్నికల కమీషనర్ ఫై అభిసంశన తీర్మానం పెట్టి తొలగించలాని సుదర్శన్ కోరారు.