వైయస్ జగన్ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నాడు : మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ రావు ఆరోపణ

Metro mat News ( Jairaju AP ) వేల సంవత్సరాలగా భారతదేశం ఐక్యతకు సమైక్యతకు ప్రతీక అని..ఇందుకోసం గాంధీ మహాత్ముడు,, పండిట్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,  వల్లభాయ్ పటేల్ వంటి మహానుభావులు కృషి చేశారని అటువంటి సమాజాన్ని నేడు తన స్వార్థపూరిత విశ్చిన్న విద్వంసకర రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని కులాలు వారికి విభజించే ప్రయత్నం చేస్తూ అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను వాడుకోవటం మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అతి పెద్ద తప్పిదమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆరోపించారు.
అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని స్వయంగా పరిశీలించడానికి వచ్చానని స్మృతి వనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఇక్కడ మొత్తం పరిశీలించిన తర్వాత ఇక్కడ జగన్ చేసిందే తప్పని తేలిందని ఆయన అన్నారు. విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున డిగ్రీ కూడా పాస్ గాని జగన్మోహన్ రెడ్డి  తన పేరును అదే పరిమాణం అక్షరాలతో పెట్టడంతో  అంబేద్కరిస్టులు మనస్థాపానికి గురై  జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే తొలగించారని ఆయన వివరణ ఇచ్చారు. అసలు అంబేద్కర్ పక్కన ఆయన పేరు రాసుకోవడమే పెద్ద తప్పు తప్పిదమని.. అందుకు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను క్షమాపణ అడగాల్సిన అవసరం ఉందని డొక్కా హితవు పలికారు. దాన్ని పక్కన పెట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అంబేద్కర్ పై దాడి జరిగిందని తన పార్టీ నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కార్యక్రమాలు చేయించడం క్షమించరాని నేరం అని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన కాంప్లెక్స్ నుంచి రాష్ట్రాన్ని కులాల వారీగా మతాల వారీగా   విడగొట్టి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఘోరమైన ఓటమిని ఇచ్చినా కూడా ఇంకా తన పద్ధతి మార్చుకోక పోగా మరింత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అదొగతిపాలు అయిందని ముఖ్యంగా దళితుల గిరిజన బతుకులు అధోపాతాళనికి నెట్టివేశాడని మాణిక్యరావు ఆరోపించారు. నిజానికి అసలైన అంబేద్కర్ ద్రోహి దళిత ద్రోహి వైస్ జగన్మోహన్ రెడ్డే నని డొక్కా అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాలుగా అమలు చేస్తున్న 59 రకాల ఎస్సీ ఎస్టీ స్కిమ్స్ ఎత్తివేసి.. లక్షాదిమందిని రోడ్డున పడేసింది జగన్ కదా,  చెప్పా పెట్టకుండా అంబేద్కర్ విదేశీ విద్యా పధకం రద్దు చేస్తే... అప్పటికే విదేశాలలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పరిస్థితి ఏంటి అని అలోచించకుండా రద్దు చేసి వందలాది మంది విద్యార్థులు పరాయి దేశాల్లో ఇబ్బందులు పడలేదా, ఎస్సీ కార్పొరేషన్ లో భూ కొనుగోలు పథకం రద్దు చేసింది కాక 24 లక్షలు ఎకరాలు అసైన్డ్ భూములు లాక్కోవాలని చూడటం నిజం కాదా అని ప్రశ్నించారు. అంతే కాకుండా 15000  మాదిగ చర్మకారులకు ఉద్యోగాలు కల్పించే.. కృష్ణ పట్నం ఇంటర్నేషనల్ లేథెర్ ప్రాజెక్ట్ ను అడ్డుకొనే వ్యక్తికి, అతని భార్యకు కార్పొరేషన్ చైర్మన్, తూర్పు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదా, ఎస్సి కార్పొరేషన్ ట్రైకార్ లీడ్ క్యాప్ కార్పొరేషన్ లకు ఒక్క పైసా ఇవ్వలేదు కదా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడులు కేసులు చంపడం చేయలేదా...మాస్కులు అడిగిన పాపానికి డా సుధాకర్ ను ఎంత దారుణంగా చంపావో నీకు తెలీదా? నియంతలు పాలించే ఉత్తర కోరియా చైనా లాంటి దేశాలలోనూ మనుషులఫై ఇలాంటి దాడులు జరగడం లేదు కదా, ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఒక్క CC రోడ్డు వేసావా?  త్రాగునీరు ఇవ్వడానికి ఒక్క ట్యాంక్ కట్టించావా? ఒక్క ఎస్సీ ఎస్టీ సర్పంచ్ కి అయినా ఒక్క పైసా ఫండ్స్ ఇచ్చావా అని జగన్ ని ప్రశ్నించారు. దళితులను హత్యలు చేసే నాయకులు తోట త్రిమూర్తులకు పదవులు ఇచ్చిన ఘనత నీది కాదా, ఎన్నికలపుడు ఎక్కువ సీట్లు మార్చింది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే లనే కాదా, నీ ప్రభుత్వంలో ఒక్క బ్యాకలాగ్ పోస్టు కూడా భర్తీ చేయక పోవడం నీ అహంకారానికి నిదర్శనం కాదా, సబ్ ప్లాన్  ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసింది నిజం కాదా, ఎస్సీ ఎస్టీలను మనుషులు లాగా కాకుండా ఓటర్లు గా భావించి... వారి అభివృద్ధి పక్కన బెట్టి..మనీ డిస్ట్రిబ్యూషన్ పేరుతో వారికీ కొంత చిల్లర ఇచ్చి చేతులు దులుపుకుంది నిజం కదా, నిజమైన అంబేద్కర్ ద్రోహివి నువ్వు కాదా అని డొక్కా జగన్ ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా మామిడి సుదర్శన్, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు లక్కెపోగు జయరాజు, దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సజ్జన్ రావు, ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా దళిత నాయకులు పాల్గొన్నారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

पयागपुर विधानसभा के पुरैनी एवं भवानी पुर में विकसित भारत संकल्प यात्रा कार्यक्रम का हुआ आयोजन

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत