వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి
Metro Mat News ( Jairaju AP )
• గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయండి
• సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శన పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముక్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• అందరి భాగస్వామ్యంతో వర్క్ షాప్
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ “స్థానిక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ ఒక సవాల్ గా మారుతోందనీ, శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. ఈ వర్క్ షాపులో పంచాయతీరాజ్ ప్రతినిధులతోపాటు, వివిధ వర్గాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ విధమైన వర్క్ షాపులు నిర్వహించడం ద్వారా వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరిగి చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు పెరుగుతాయన్నారు. ఉపాధి అవకాశాలు వస్తాయనీ, పర్యావరణానికీ మేలు కలుగుతుందన్నారు.