ప్రతినెలా గృహ నిర్మాణ పధకాలపై అధికారులతో సమీక్ష

Metro Mat News ( Jairaju AP ) రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార శాఖామాత్యులు కె.పార్ధ సారధిఅమరావతి,3 జూలై:రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మూడు మాసాల్లో లక్షా 28వేల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖామాత్యులు కె.పార్ధ సారధి వెల్లడించారు.ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్ట్రలు,ఎస్ఇ,ఇఇలు ఆశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
అనంతరం రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్.చంద్రబాబు నాయుడు అన్ని ప్రభుత్వ శాఖలు 100 రోజుల కార్యాచరణను రూపొందించుకోవాలన్న ఆదేశాలకు అనుగుణంగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ కింద రానున్న మూడు మాసాల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పునరుద్ఘాటించారు.ఇందుకు గాను 2వేల 520 కోట్ల రూ.లన ఖర్చు చేయనున్నట్టు మంత్రి పార్ధసారధి తెలిపారు.అంతేగాక రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 8.02 లక్షల గృహాలను వచ్చే మార్చి నెలాఖరుకు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి పార్ధసారధి చెప్పారు.అదే విధంగా నిర్మాణ దశలో ఉన్న 6.08  లక్షల  గృహాల స్టేజ్ కన్వర్సన్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.గృహ నిర్మాణాలు జరిగే లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి విశాఖపట్నం, విజయవాడ,నెల్లూరు,రాయల సీమల్లోని ధర్మల్ పవర్ స్టేషన్ల నుండి వచ్చే ప్లై యాష్ వినియోగించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు.అదే విధంగా ఆప్సన్-3 కింద నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి వివరించారు.రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను వేగవంతంగా పూర్తి చెయ్యటానికి అధికారులందరూ కృషి చెయ్యాలని ఆదేశించామని మంత్రి పార్ధ సారధి చెప్పారు.గృహ నిర్మాణాలకు సంబంధించి ఈనెలాఖరు లోగా రీకన్సిలేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.అంతేగాక ఇకమీదట ప్రతి నెలా గృహ నిర్మాణాల ప్రగతిని అధికారులతో సమీక్షించడం జరుగుతుందని  అన్నారు.రాష్ట్రంలోని పేదలందరికీ సొంతిటి కలన సాకారం చేస్తాం...అంతకు ముందు రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో జరిగిన గృహ నిర్మాణశాఖ సమీక్షలో గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి పార్ధసారధి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ఆదిశగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అర్హులందరికీ గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందని కావున గృహ నిర్మాణాలను వేగవతంగా పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా 2015 లో ప్రారంభమైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన,(అర్బన్) పథకం క్రింద జిల్లాల్లో  గృహ నిర్మాణాల ప్రగతిని,రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాల వంద రోజుల ప్రణాళికపై నియోజక వర్గాల వారీగా మంత్రి సమీక్షించారు.అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.గృహ నిర్మాణ శాఖలో ఉన్న ఖాళీలను ప్రస్తావిస్తూ పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని,క్రింది స్థాయి ఖాళీలను జిల్లాల నుంచి లేదా డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.గృహ నిర్మాణ పథకాల అమలుకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని మంత్రి పార్ధ సారధి అధికారులకు స్పష్టం చేశారు.ఈసమావేశంలో ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్,ప్రత్యేక కార్యదర్శి మైదీన్ దివాన్,ఎండి గిరీషా,పిడిలు,ఎస్ఇలు,ఇఇలు తదితర అధికారులు పాల్గొన్నారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

पयागपुर विधानसभा के पुरैनी एवं भवानी पुर में विकसित भारत संकल्प यात्रा कार्यक्रम का हुआ आयोजन

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत