రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Metro Mat News correspondent jayraju :-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
పార్టీ కార్యాలయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకోగా అక్కడ వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు ఆయన వెంటరాగా కార్యాలయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్న అనంతరం ఉదయం 10.30 నిమిషాలకు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. అనంతరం ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. రెండో సంతకం-  గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం చేశారు. పి.ఆర్. అండ్ ఆర్.డి. ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సోదరులు శ్రీ నాగబాబు గారు ఆయన వెంట ఉన్నారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

पयागपुर विधानसभा के पुरैनी एवं भवानी पुर में विकसित भारत संकल्प यात्रा कार्यक्रम का हुआ आयोजन

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत