స్వర్గీయ.రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఎంటర్టైన్మెంట్, ఈనాడు గ్రూపు సంస్థల ప్రతినిధులు,జాతీయ మీడియాకు బి 1 గ్యాలరీ, వీరికి కృష్ణవేణి విద్యాసంస్థల ఆవరణ బి1 పార్కింగ్,
అధికారుల వాహనాలు,జనరల్ పబ్లిక్ (బస్సులు, ఇతరుల వాహనాలు) వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బెంజ్ సర్కిల్ వద్ద వాహన పాసు లేని వాటికి వీఆర్ సిద్ధార్థ లో పార్కింగ్ చేయాలని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
పార్కింగ్ ప్రదేశాల్లో సైనేజీ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
సా.4 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. ప్రధాన వేదిక వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు.
సభ ఏర్పాట్లు అన్ని ఈరోజు సాయంత్రానికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సీఎం భద్రత అధికారి జార్జ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రధాన వేదికకు చేరుకుని రూట్ కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ లిమిట్స్ లో ఉందని, ఈ రూట్ పరిశీలించామని, కార్యక్రమం రోజున వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.సమావేశానికి ముందు ఏపీ సిఆర్డిఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, సిఆర్డిఏ అదనపు కమిషనర్ అలీం బాషా, జి ఏ డి, ప్రోటోకాల్, వివిధ శాఖల అధికారులతో కలసి సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పి ఎస్ వి డి ప్రసాద్, గన్నవరం డిఎస్పి జయసూర్య, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ టీ. కస్తూరి, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఉయ్యూరు, గుడివాడ రెవిన్యూ డివిజన్ల అధికారులు డి రాజు, పి పద్మావతి, గుడివాడ, వైయస్సార్ తాడిగడప మున్సిపల్ కమిషనర్లు సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.