రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

Metro Mat News Correspondence Jayaraju :-అమరావతి,22 జూన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40వేల 336 వ్యవసాయ విద్యుత్ కనక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ దస్త్రంపై తొలి సంతకం చేశారు.
ఈమేరకు శనివారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధనశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈసందర్భంగా 40వేల 336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనక్షన్లు మంజూరు చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు.అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం చేశారు.అదే విధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దస్త్రంపై మూడో సంతకం చేశారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తనకు విద్యుత్  శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్ ను అందించేందుకు విద్యుత్ సరఫరా డిమాండులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని స్పష్టం చేశారు.దేశంలో విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు  చంద్రబాబు నాయుడని ఆయన తీసుకు వచ్చినన్ని విద్యుత్ సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదని అన్నారు. దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.విద్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందించే విధంగా పనిచేయాలని మంత్రి రవికుమార్ ఆకాంక్షించారు.గత ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేయడమే గాక 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,ఒంగోల్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి,బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్,బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్ర వర్మ,పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్,పలువురు ఇతర ప్రజాప్రతినిధులు,ఇంధనశాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

पयागपुर विधानसभा के पुरैनी एवं भवानी पुर में विकसित भारत संकल्प यात्रा कार्यक्रम का हुआ आयोजन

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत