గంజాయి, డ్రగ్స్ విచ్చల విడి వినియోగం పై ఉక్కుపాదం మోపుతాం

*రాష్ట్ర  హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత*

Metro Mat News Correspondent  jayaraju :-అమరావతి, జూన్   గంజాయి, డ్రగ్స్ విచ్చల విడి వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని  రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

బుధవారం  ఉదయం 11.19 గంటల సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ను విచ్చల విడిగా వినియోగించడం జరుగుచున్నదని, మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ఒక టాస్కుఫోర్సును కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.  గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు శాంతి భద్రత విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, అటు వంటి సమస్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారని, ఆ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామన్నారు. పోలీస్ శాఖ పరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, చాలా పోలీస్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలు అన్నింటినీ రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.  తమ పార్టీ నాయకులు, ప్రతినిధుల కోసం కాకుండా ప్రజల కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ అధికారులు ఎటు వంటి రాజీ లేకుండా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా  విచ్చల విడిగా విమర్శించేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా పోస్టులు పెట్టడాన్ని ఏమాత్రము సహించబోమని ఆమె హెచ్చించారు.  ఒక సామాన్య మద్యతరగతి కుటుంబానికి చెందిన తనను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కొణిదల పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు అందరికీ మరియు పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన గురతర భాద్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

पयागपुर विधानसभा के पुरैनी एवं भवानी पुर में विकसित भारत संकल्प यात्रा कार्यक्रम का हुआ आयोजन

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत