ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై కలక్టర్లతో సిఎస్ వీడియో సమావేశం

Metro Mat News ( Jayaraju AP ) విజయవాడ,29 జూన్: రాష్ట్రంలో ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తున్నారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జులై 1వ తేదీన 65 లక్షల 18వేల 496 మందికి గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింట ఫించన్లు పంపిణీకి సంబంధించి  4 వేల 399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.అదే విధంగా ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షన్ రీల సేవలను కూడా వినియోగించు కునేందుకు జిల్లా కలెక్టర్లు ఎంపిడిఓ,మున్సిపల్ కమీషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఫించన్లు పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు.
సోమవారం ఉదయం 6గం.లకు పింఛన్లు పంపిణీ ప్రారంభం కావాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.ఫించన్లు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన మొత్తాన్ని శనివారం రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు.ఎక్కడైనా ఏ బ్యాంకైనా డబ్బును శనివారం రాత్రికి ఇవ్వలేకుంటే అలాంటి బ్యాంకులు ఆదివారం తెరిచి ఉంచి సంబంధిత ఫించన్ మొత్తాన్ని ఇవ్వాలని బ్యాంకులకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, యం.శివ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి. సత్యనారాయణ,వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

पयागपुर विधानसभा के पुरैनी एवं भवानी पुर में विकसित भारत संकल्प यात्रा कार्यक्रम का हुआ आयोजन

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत