జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల రామానాయుడు

Metro Mat News correspondence jayaraju :-అమరావతి,20 జూన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు.ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పదేళ్ళకు వెనక్కి నెట్టిందని ఆరోపించారు.
కాలువలు,డ్రైన్లలో చూడు తొలగింపు,డీసీల్టేషన్ పనులకు సంబంధించిన దస్త్రం పై తొలి సంతకం చేశారు.సియంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి క్షేత్ర స్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తాం.రాష్ట్రంలోని రైతాంగానికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు వీలుగా వివిధ ఏటిగట్లు పటిష్టీకరణ,షట్టర్లు, గేట్లు వంటివాటి భరమ్మత్తుల నిర్వహణకు అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి రామానాయుడు చెప్పారు.రాష్ట్రంలో పోలవరం సహా ఇతర ఎత్తి పోతల పధకాలను, ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టులు అన్నింటినీ ప్రాధాన్యతా ప్రకారం సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

अहिंसा परमो धर्मः परंतु सेवा भी परमो धर्म है :- आचार्य प्रमोद कृष्णम

पयागपुर विधानसभा के पुरैनी एवं भवानी पुर में विकसित भारत संकल्प यात्रा कार्यक्रम का हुआ आयोजन

भीषण गर्मी के कारण अधिवक्ता रामदयाल पांडे की हुई मौत