ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తున్న క్రీడాకారులు
Metro Mat News ( Jayaraju AP )గత వై. ఎస్. ఆర్. సి. పి. ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయి. క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడే మేధావులు, ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు ఈ మధ్య కాలంలో కలిసిన వారిలో ఉన్నారు. ఇలా కలసినవారిలో ప్రముఖ క్రికెటర్ శ్రీ హనుమ విహారి కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగం అభివృద్ధికి దోహదపడే అనేక విషయాలను వారు ప్రస్తావించారు. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని దానికి సరైన మార్గదర్శనం చేసేవారు అవసరమని వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించారు. క్రీడలతో సంబంధంలేని వారి చేతికి క్రీడా సంఘాలను అప్పగించవద్దని వారు ఆవేదనతో విన్నవించారు. క్రికెట్ లో అనుభవం ఉన్నవా